Top Telugu classics must to watch (చూసితీరాల్సిన తెలుగుసినిమాల జాబితా )

                                               
1932లో మొదలయిన తెలుగుసినీప్రస్థానంలో ఇప్పటివరకు వచ్చిన వేలాది సినిమాల్లో ది బెస్ట్ సినిమాలను సెలెక్ట్ చేయడమంటే అది నిజంగా చాలా కష్టమయిన పనే అని చెప్పాలి, లేదా అదో ఇంపాజిబుల్ టాస్క్ అనే చెప్పొచ్చు. బట్... మిస్ అవకుండా  చూడాల్సిన తెలుగు సినిమాల లిస్ట్ మీకోసం… అఫ్ కోర్స్ ఇందులో కమర్షియల్, నాన్ కమర్షియల్, హిట్, ఫ్లాప్ తో సంబంధాలు లేకుండా మంచి సినిమాలను మాత్రమే ఇంక్లూడ్ చేశానని గమనించగలరు. సో షల్ వుయ్ స్టార్ట్ విత్ ది లిస్ట్ ఫ్రం ఓల్డ్ టుది లేటెస్ట్ ఇన్ ఆర్డర్???                                 
 1953లో విడుదలైన "దేవదాసు" సినిమా కథ, కథనాలకంటే అందులోని పాత్రల్లో జీవించిన అక్కినేని నాగేశ్వరరావ్, సావిత్రి నటనతో  పాటు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన పాటలతో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.                            

 1955లో వచ్చిన "మిస్సమ్మ" ఆల్ టైం బెస్ట్ కామెడీ మూవీగా చెప్పుకోవచ్చు స్టారింగ్ ఎన్టీయార్, అక్కినేని, సావిత్రి అండ్ జమున.                                           

 1957లో వచ్చిన "మాయాబజార్" సినిమా మూవీమేకింగ్ పై ఆసక్తి ఉన్నవారికి విజువల్ గైడ్ గా నిలిచిపోయింది అండ్ దట్ వాజ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆఫ్ దోజ్ డేస్.                               

1963లో వచ్చిన "లవకుశ" సినిమాను రోజుల్లో ఊర్లనుండి బండ్లు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చి నీరాజనాలర్పించిన సినిమా అది. ఎన్టీయార్, అంజలీదేవిలు సినిమా తర్వాత తెలుగువారి గుండెల్లో సీతారాములుగా నిలిచిపోయారు.         

ఇక విఫలప్రేమకు నిలువుటద్దంగా నిలిచిన సంగీతభరిత చిత్రం "మూగమనసులు". 1963 లో వచ్చిన సినిమాలో అక్కినేని, సావిత్రి అండ్ జమునల నటన అద్భుతం.                   

1967లో బాపు దర్శకత్వంలో వచ్చిన "సాక్షి" సినిమా అమాయకత్వానికి ప్రతిరూపమైన పాత్రలో కృష్ణ నటనలోని మరచిపోలేని కోణం చూపించింది                              

                                                             
1971లో కృష్ణ తెలుగుసినిమాకు "మోసగాళ్ళకు మోసగాడు" సినిమాతో కౌబాయ్ జానర్ ను పరిచయం చేశాడు. అన్నట్టు డబ్బింగ్ ద్వారా హాలీవుడ్ లో రిలీజయిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే.                       
  1974లో వచ్చిన కృష్ణ వందవ సినిమా "అల్లూరి సీతారామరాజు" కూడా తన నటనకు కలికితురాయిగా నిలిచిపోవడమే కాకుండా తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచిపోయింది.                                 
  1975లో వచ్చిన బాపుగారి మరో అద్భుతదార్శనికత "ముత్యాలముగ్గు" సినిమా. సినిమాలో ముళ్ళపూడి వారందించిన సంభాషణల పాపులారిటీ ఏకంగా డైలాగ్స్ క్యాసెట్స్ అమ్మకానికి తెరతీసింది.       
1977లో నందమూరి తారకరామారావు అన్నీ తానై చేసిన వెండితెర అద్భుతం "దానవీరశూరకర్ణ". నెగెటివ్ పాత్ర అయిన దుర్యోధనుడికి తన రాజసంతో ప్రాణప్రతిష్ట చేసిన సినిమాలో అన్నగారి నోటినుండి వచ్చిన డైలాగ్స్ తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేరన్నది అందరూ ఒప్పుకోవలసిన సత్యం.         
ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ చూసితీరవలసిన బెస్ట్ సినిమాల్లో తొలి పది సినిమాలేవో చూశాంగా. సో నెక్స్ట్ 10 సినిమాలు తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్