Rajinikanth evergreen hit film "Basha" Trivia (సూపర్ స్టార్ రజినీకాంత్ "భాషా" విశేషాలు)

                       ఎన్ని సినిమాలు వస్తున్నా, పోతున్నా... జస్ట్ కొన్ని మాత్రమే సినిమా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా, ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అవే సినిమా మేకింగ్ పరంగా కూడా ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిపోతాయి. అలాంటి గ్రేట్ ఫిల్మ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "భాషా". ఒక్కసారి చూసి ఆగిపోయే సినిమా కాదు భాషా.. వందసార్లయిన సరే నాన్ స్టాప్ గా చూడగలిగిన సినిమా ఇదని నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ సురేష్ కృష్ణ, రజినీ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది. లెట్స్ గెట్ ఇన్ టూ సమ్ ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ రజినీకాంత్స్ భాషా.... 

                   తెలుగు, తమిళం... ఇలా నాట్ జస్ట్ సౌత్ ఇండియా, బట్ ఎంటైర్ ఇండియన్ సినిమా స్క్రీన్ ప్లే రూపురేఖల్ని మార్చివేసిన వేసిన సినిమా "భాషా". సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, అందాల భామ నగ్మా జంటగా సురేష్ కృష్ణ దర్సకత్వంలో 1995లో విడుదలైన  చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. సినిమా విడుదలై 20 సంవత్సరాలు అయినప్పటికీ అది డైరెక్టర్స్ కు గైడ్ లా మిగిలిపోయే ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, డ్యాన్స్ అండ్ ఫైట్స్... ఇలా అన్ని విభాగాల్లోనూ భాషా సినిమా మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది
                             ఇంతటి సంచలన విజయం నమోదు చేసుకున్న భాషా చిత్రం మేకింగ్ వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి. భాషా కథ పుట్టడమే సర్ప్రైజ్. బిగ్ బీ అమితాబ్, రజినీకాంత్, గోవిందా కలిసి నటించిన బాలీవుడ్ సినిమా "హమ్" కోసం దర్శకుడు ముకుల్ ఆనంద్ రాసుకున్న సన్నివేశం  చిత్ర కథకు ప్రేరణ. అవకాశం లేక సినిమా నుండీ తీసివేసిన సన్నివేశం ఎంతగానో నచ్చిన రజినీకాంత్, దర్శకుడు సురేశ్ కృష్ణతో  షేర్ చేసుకుని సీన్ బేస్ చేసుకుని స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తపరిచాడట. అంతేకాకుండా సినిమాకు భాషా అన్న టైటిల్ కూడా స్వయంగా రజినీ ప్రపోజ్ చేసిందే. తన తమ్ముడు గోవిందాకు పోలీస్ అకాడమీలో సీట్ ఇప్పించడానికి అమితాబ్ ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్లి మాట్లాడుతూ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్ అది. అన్నట్టు ఇదేలాంటి పవర్ ఫుల్ సీన్ భాషాలో కూడా ఉంటుంది

                                  అన్నట్టు భాషా లాంటి అద్భుతమైన సినిమాకు, మన హైదరాబాద్ నగరానికి ఎంతో సంబంధం ఉంది. ఇది పేరుకు తమిళంలో తీసిన సినిమాయే అయినా  చిత్రకథ తయారయింది మాత్రమ్ మన హైదరాబాద్ లోనే. సూపర్ స్టార్ కి హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ అంటే చాలా ఇష్టం. అదే హోటల్లోనే భాషా చిత్రకథ మొత్తం తయారయిందట. అంతేకాదు భాషా మేకింగ్ వివరాల్లోకి వెళ్తే మరెన్నో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ మనకు తెలుస్తాయి
                              భాషా సినిమా స్టోరీ డిస్కషన్స్, డెవలప్ మెంట్ మొత్తం దాదాపు రెండువారాల పాటు రజినీకి ఇష్టమయిన హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ రూంలో రజినీ, సురేశ్ కృష్ణలతో కలిసి టీమ్ మొత్తం బసచేసి మరీ జరిగిందట. అలాగే సినిమాలో భాషా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేసింది కూడా హైదరాబాద్ లోని గోల్కొండ టూంబ్స్ లోనే. ఇక సినిమా మొదట్లో వచ్చే పాపులర్ సాంగ్ "నే ఆటోవాన్ని" వెనక కూడా చిన్న గమ్మత్తయిన విషయం ఉంది. పాటను జాగ్రత్తగా చూస్తే హీరో వెనక వరుసల్లోని ముందు వరుసలో ఉన్న డ్యాన్సర్లందరూ తరువాతి కాలంలో కొరియోగ్రాఫర్లుగా పాపులర్ అయినవారే, సారి పాటను జాగ్రత్తగా వాచ్ చేయండి. ముందు వరుసలో మీకు డ్యాన్స్ మాస్టర్స్ కళ్యాణ్, అశోక్ రాజ్, అమ్మ రాజశేఖర్ మొదలైన వారు కనిపిస్తారు

                            భాషా సినిమా ముహూర్తం షాట్ వీ యమ లోని గుడి దగ్గర జరిగింది. కాలక్రమేణా అక్కడ ఓపెనింగ్ జరుపుకున్న చిత్రాలు సక్సెస్ కావడంతో గుడి కాస్తా రజినీ గణపతి టెంపుల్ గా పిలవబడుతోందట.  సినిమాలోని హైలైట్ సీన్ ఏది అని ఎవర్నడిగినా టకీమని చెప్పే సమాధానం ఇంటర్వెల్ సీన్. అదే అప్పటివరకూ సాదాసీదా ఫ్యామిలీమ్యాన్ గా కనిపించే మాణిక్యం తన ఒరిజినల్ క్యారెక్టర్ "భాషా"ను రివీల్ చేయడం. ఇది సినిమా మొత్తానికి పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు. కుటుంబసభ్యుల కోసం అంతవరకూ తన్నులుతిన్న ఆటోడ్రైవర్ సహనం కోల్పోయి తనేంటో బయటపడే సీన్ అది. అయితే రొటీన్ కు భిన్నంగా పేజీలకు పేజీల భారీ డైలాగ్స్ లేకుండా "రజినీ ఒక్క డైలాగ్ చెప్తే వంద డైలాగ్స్ చెప్పినట్టే" అన్నట్టు కేవలం సింగిల్ డైలాగ్ తో సీన్ పండించారు. అదే నేటికీ అందరి నోళ్ళలో నానుతూ ఉన్న డైలాగ్ "నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే". నిజానికి  డైలాగ్ క్రియేట్ చేసింది కూడా సూపర్ స్టార్ రజినీయే
                                   రజినీకాంత్ మహోన్నతమైన వ్యక్తిత్వం  మూర్తీభవించిన మనిషి... ఇదీ తనని క్లోజ్ గా వాచ్ చేసినవారు చెప్పేమాట. చిన్నాపెద్దా తేడాలేకుండా లైట్ బోయ్ నుండీ నిర్మాత వరకూ అందరి సలహాలను ఒకేలా స్వీకరిస్తాడనడానికి భాషా గెటప్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. భాషా గెటప్ మొత్తం రెడీ అయ్యాక ఎందుకో రజినీకి ఏదో లోటుగా ఫీలవుతున్న రజినీకి, మేకప్ ఆర్టిస్ట్ సుందరమూర్తి కాడలులేని నల్ల కళ్ళద్దాలు పెడితే బాగుంటుందని చెప్పడంతో రజినీ సలహా స్వీకరించి తృప్తిగా ఫీలయ్యాడట. నిజంగానే దట్ స్మాల్ ఎలిమెంట్ మేడిట్ బిగ్ ఆన్ ది స్క్రీన్

                                       భాషా... కేవలం సినిమాగానే మొదలైనా రిలీజైన తర్వాత అది అక్కడితో ఆగలేదు. అప్పటికే రజినీకాంత్ కు స్టార్డం ఉన్నప్పటికీ రియల్ సూపర్ స్టార్ గా పేరు స్థిరపడింది మాత్రం భాషా తర్వాతే. రజినీ స్టైల్స్, రజినీ డైలాగ్స్, రజినీ మేనరిజమ్స్... ఇలా అన్నింట్లోనూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ అయింది మాత్రమ్ ఖచ్చితంగా భాషా విడుదలైన తర్వాతే

అందుకే భాషా కేవలం సినిమా మాత్రమే కాదు... 

భాషా సంచలనం... 
భాషా అద్భుతం.... 
భాషా చరిత్ర... 
రజినీ నటవిశ్వరూపం భాషా... 
రజినీ సంధించిన సమ్మోహనాస్త్రం భాషా... 
                              భాషా సినిమా 1995 జనవరి 15 విడుదలైంది. అంటే 2015 జనవరి 15 తో 20 సంవత్సరాలు పూర్తయింది.   ఇరవై సంవత్సరాల్లో భాషా చిత్రం స్క్రీన్ ప్లే ఇన్స్పిరేషన్ తో వచ్చిన చిత్రాల లిస్టు చూస్తే అదో పెద్ద చాంతాడయి కూర్చుంటుంది. మచ్చుకు కొన్ని పాపులర్ ఫిల్మ్స్ చూస్తే బాలకృష్ణ నటించిన  సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చిరంజీవి  ఇంద్ర, మాస్టర్,  జూనియర్ ఎన్టీఆర్ నటించిన అది, సింహాద్రి, వెంకటేశ్ నటించిన తులసి... ఇలా ఘనవిజయాలు సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలకు రజినీకాంత్ భాషా ఇన్స్పిరేషన్ అని ఒప్పుకోవలసిందే. అందుకే భాషా సినిమా చూసినవారెవ్వరూ ఒక్కసారితో ఆగిపోరు.. వందసార్లయినా సరే చూస్తూనే ఉంటారు. దటీజ్ భాషా... దటీజ్ రజినీకాంత్... దటీజ్ సురేశ్ కృష్ణ ....