Nani "Majnu" Latest Telugu movie Review

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో... అది కూడా వరుస విజయాలతో రేసులో దూసుకెళ్ళిపోతున్నాడు. "ఎవడే సుబ్రహ్మణ్యం" తో మొదలుపెట్టి రీసెంట్ గా విడుదలైన "జెంటిల్ మేన్" వరకు ఒకదాని తర్వాత మరోటి అన్నట్టు హిట్స్ కొడ్తూ వచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ మోడర్న్ "మజ్ఞు"గా మన ముందుకు వచ్చాడు విత్ ఏ ట్యాగ్ లైన్ "స్టాప్ వెయిటింగ్... స్టార్ట్ లవింగ్". అన్నట్టు మజ్ఞు అంటే ఇదేదో అప్పట్లో నాగార్జున చేసిన విషాదమైన స్టోరీ లాంటిది కాదు బాస్. అందుకే మోడర్న్ మజ్ఞు అన్నాను. మరి ఇంతకీ ఈ మజ్ఞు స్పెషాలిటీ ఏంటీ అంటారా? వస్తున్నా అక్కడికే.
కథలోకి వెళ్తే ఆదిత్య (నాని) సినిమా ఫీల్డ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. ఇంతకీ ఎవరి దగ్గరో తెలుసా. మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దగ్గరే. అదికూడా బాహుబలి సినిమాకే. ఒక అందమైన అమ్మాయి సుమ ని (ప్రియశ్రీ) చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను పొందేందుకు ఎన్నో ప్లాన్స్ అండ్ కష్టాలు. అఫ్ కోర్స్ అవన్నీ మనకు నవ్వు తెప్పించేవే. అక్కడే హీరో తన ప్రేమను పొందేందుకు సుమకు బాగా నచ్చే ప్రేమకథ చెప్పాల్సి వస్తుంది. అక్కడే ట్విస్ట్... హీరోకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ దట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ స్టోరీ. అక్కడే ఫ్లాష్ బాక్ స్టార్ట్.
ఆదిత్య భీమవరంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బెంగుళూరు లో ఉద్యోగం సంపాదిస్తాడు. సరిగ్గా అప్పుడే కిరణ్ (అనూ ఇమ్మానుయేల్) కనిపించడం, లవ్ లో పడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వన్ సైడే అనుకోండి. తను స్టూడెంట్. తన ప్రేమను పొందేందుకు కాలేజ్ లో లెక్చరర్ గా చేరటాడు ఆదిత్య. మళ్లీ ట్రయల్స్ అండ్ ఎఫర్ట్స్ ప్రేమకోసం. ఇవికూడా బాగా నవ్వు తెప్పిస్తాయి ప్రేక్షకులకు. మొత్తానికి ప్రేమలో సక్సెస్ పొందడం, తర్వాత అనుకోనివిధంగా ఫెయిల్యూర్... ఆ బాధలో మజ్ఞు  అయిపోవడం జరుగుతుంది. ప్రేమను మరచిపోవడానికి మందుబాబులయిపోవడం మామూలే... కానీ మన ఆదిత్య సినిమాను వ్యసనంగా చేసుకుంటాడు. ఇదీ ఫ్లాష్ బాక్. చివరికి ఏమవుతుంది? సుమ ఆదిత్యను ప్రేమించిందా? కిరణ్ తో మళ్ళీ కాంప్రమైజ్ అవుతుందా? ఫైనల్ గా ఆదిత్య జోడీ ఎవరు? ఇంతకీ గెస్ట్ రోల్ లో వచ్చే రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఎంటర్టైనింగ్ సమాధానమే "మజ్ఞు" సినిమా.

తొలి చిత్రం "ఉయ్యాల జంపాల" తో అందరినీ ఆకర్షించిన డైరెక్టర్ విరించి వర్మ మరోసారి తన ఫీల్ గుడ్ స్టోరీతో అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. ఎక్కడా సినిమాటిక్ గా కాకుండా అదేదో మన మధ్యే జరుగుతున్న ఫీలింగ్ లో సినిమా ను నడిపించిన విధానం బాగుంది. ఇక నేచురల్ స్టార్ అని ఆల్రెడీ బిరుదు పొందేసిన నాని మరోసారి ఆదిత్య పాత్రలో జీవించేసి తాను హీరో కాదు, మన పక్కింట్లో రోజూచూసే అబ్బాయే అని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ మూవీయే అయినా తమకున్నంతలో మంచి నటనతో హీరోయిన్స్ అనూ అండ్ ప్రియా మంచి మార్కులే కొట్టేశారు. ఇటీవలి కాలంలో మెలోడియస్ మ్యూజిక్ తో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న గోపీసుందర్ మరోసారి తనదైన మార్క్ మ్యూజిక్ తో మజ్ఞు సినిమాకు ఓ పాజిటివ్ గా నిలిచాడు గోపీసుందర్. ఎనదర్ స్పెషల్ ఎట్రాక్షన్ ఫర్ మజ్ఞు ఆర్ ది డైలాగ్స్. తన మొదటి ప్రయత్నంలోనే "మిర్చి కిరణ్" సరదా, సరదాగా సాగే సింపుల్ బట్ యెటకారంతో సాగే మాటలతో ఆకట్టుకున్నాడు.
ఇంతకీ ఓవరాల్ గా నేను చెప్పొచ్చేదేంటంటే... తప్పకుండా మంచి సినిమా అండ్ టైంపాస్ కావాలనుకునే వాళ్ళు ఓ సారి సినిమా చూడాల్సిందే. మంచి సంగీతం ఇష్టపడే వారయితే ఓ రెండు సార్లు చూడొచ్చు. నవ్వులంటే ఇష్టమయితే ఓ మూడుసార్లు చూడొచ్చు. ఫైనల్ గా నాని అంటే ఇష్టమున్న వాళ్ళు ఓ నాలుగుసార్లు చోడొచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం. నాకయితే ఓ ఫీల్గుడ్ పైసా వసూల్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది... మీరూ చూడండి... కింద కామెంట్స్ లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి.