Interesting facts about "Aithe" prestigious film from Just Yellow directed by Chandrasekhar Yeleti

తెలుగు సినిమా అంటే ఆరు పాటలు, ఐదు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు, మూడు సెంటిమెంట్ సన్నివేశాలు, ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో... ఇదీ 2000ల సవత్సరాలలో ఉన్న ఇంప్రెషన్. అఫ్ కోర్స్ అప్పట్లో చాలావరకూ సినిమాలు ఇదే ఫార్ములాతోనే వచ్చేవి. ఆ సమయంలో ఈ ట్రెండ్ బ్రేక్ చేస్తూ అందరినీ కట్టిపడేసిన సినిమా 2003 ఏప్రిల్ 11న విడుదలైన "“ఐతే”". సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్టే దీని ట్యాగ్ లైన్ కూడా వెరైటీగా అనిపించింది... "అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు". అదేలా ఈ సినిమా అప్పటి సినిమాలన్నింటికీ భిన్నంగా అనిపించింది కూడాను. దాదాపుగా అంతా కొత్త ఆర్టిస్టులు, కేవలం ఒకే ఒక్క పాట, పూర్తిగా స్క్రీన్ ప్లే పై నడిచే చిత్రం అండ్ ఫైనల్ రిజల్ట్... సూపర్ హిట్.
“ఐతే” దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. తనకిది దర్శకుడిగా డెబ్యూ ఫిల్మ్. అంతకు ముందే "లిటిల్ సోల్జర్స్" వంటి ఓ వెరైటీ ఫిల్మ్ అందించిన దర్శకనిర్మాత గున్నం గంగరాజు “ఐతే” ఫిల్మ్ ప్రొడ్యూసర్. జస్ట్ యెల్లో మీడియా బేనర్ పై తెరకెక్కించిన గంగరాజు దర్శకుడు చందూకి క్లోజ్ రిలేటివ్ కూడా. మెరీన్ రేడియో ఆఫీసర్స్ కోర్స్ కంప్లీట్ చేసి గంగరాజు దగ్గర కాపీరైటర్ గా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా లిటిల్ సోల్జర్స్ సినిమాకు పనిచేసిన చందూలోని టాలెంట్ మెచ్చి గంగరాజు గారు “ఐతే” ద్వారా తనకు అవకాశమివ్వడం, చందూ తన టాలెంట్ నిరూపించుకోవడం అలా అలా జరిగిపోయాయట.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ప్లేన్స్ తో ఎటాక్ చేసిన ఒసామా బిన్ లాడెన్, తనపై అప్పట్లో ప్రకటించిన హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ యే తన “ఐతే” సినిమాకు ఇన్స్పిరేషన్ అంటాడు చంద్రశేఖర్ యేలేటి. అలాగే ఆ వంద మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ తనకొస్తే అన్న ఆలోచనలకు ప్రతిరూపమే ఈ సినిమాలోని పాత్రలు అండ్ సన్నివేశాలట. అందుకే ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కూడా చాలా వరకు ఆఫ్ బీట్ స్టైల్లో రియాలిటీకి దగ్గరగా ఉండడం మనం గమనించవచ్చు. అలాగే తను సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తాయి మనకు తెరపైన.
ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్స్ విషయానికొస్తే మెయిన్ గా చెప్పాల్సింది విలన్ గా నటించిన పవన్ మల్హోత్రా. తను అప్పటికే పాపులర్ మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్, ఇక హీరోస్ అండ్ హీరోయిన్ గా నటించిన మోహిత్, శశాంక్, జనార్ధన్, అభిషేక్ అండ్ సింధు తోలానీ అందరూ కొత్త ముఖాలే కావడంతో, వారి పాత్రల్లో ఇమిడిపోయినట్టుగా  అనిపించడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది “ఐతే” సినిమా. చాలా చిన్న సినిమాగా అతి తక్కువ ప్రింట్లతో రిలీజైన “ఐతే” తర్వాత సినిమాకు వచ్చిన అప్లాజ్ తో ప్రింట్లను పెంచుకుంటూ పోయి పెద్ద సినిమాగా మారి బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
తెలుగు సినిమాలలో ఉండే ముఖ్యమైన ఫ్యాక్టర్ పాటలు. సర్ప్రైజింగ్లీ “ఐతే” లో కేవలం ఒకే ఒక పాట ఉంటుంది. “చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే” అంటూ ఆశాభావాలను వ్యక్తపరచేలా సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా అద్భుతమైన స్వరాలను అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణీ మాలిక్. అన్నట్టు ఈ సింగిల్ సాంగ్ పాడిందెవరో తెలుసా? మరో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. ఆయన కళ్యాణీ మాలిక్ కు సొంత అన్నయ్య కూడా. సో తమ్ముడి మ్యూజిక్ పాపులర్ అవడానికి అన్నయ్య స్వరసహాయం చేశాడన్నమాట.
“ఐతే” సినిమా ప్రొడ్యూజర్ గా గున్నం గంగరాజు గారికి, డైరెక్టర్ గా చంద్రశేఖర్ యేలేటికే కాకుండా, ఈ సినిమాతో పరిచయమయిన మోహిత్, శశాంక్ అండ్ అభిషేక్ లకు తర్వాత కొన్ని సినిమాలలో హీరోలుగా నటించేలా అవకాశాలను తెచ్చిపెట్టింది. అలాగే డెబ్యూ చేసిన సింధుతొలానీ తర్వాత అతనొక్కడే, గౌతం ఎస్సెస్సీ, మన్మథ, నీ నవ్వే చాలు వంటి సినిమాల్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా కూడా కనిపించి మెప్పించింది. మ్యూజిక్ డైరెక్టర్ గా కళ్యాణీ మాలిక్ కు, కమెడియన్ గా హర్షవర్ధన్ కు అండ్ విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవన్ మల్హోత్రా కు కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చిన సినిమాగా కూడా ఈ “ఐతే” ను చెప్పుకోవచ్చు. ఆన్ ది హోల్, రిలీజైన 2003 టైం కే కాకుండా దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఓ డిఫరెంట్ ఫిల్మ్ గానే నిలిచిపోయింది “ఐతే” చిత్రం.