Akkineni Nagarjuna Nirmala Convent Review


                         టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అంటేనే కొత్తదనం అన్నది తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. అలాగే కొత్తదనంతో పాటు కొత్తవారిని తెరకు పరిచయం చెయ్యడం నాగ్ కున్న అలవాటన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడా విషయం మరోసారి చాటిచెబుతూ వచ్చిన లేటెస్ట్ మూవీ "నిర్మలా కాన్వెంట్". టైటిల్ లో తెలుస్తున్నట్టే ఇదో టీనేజ్ ఆర్ రాదర్ ఇంకాస్త చిన్న ఏజ్ లవ్ స్టోరీ. సో మరి వాట్ ఈజ్ దేర్ ఇన్ నిర్మలా కాన్వెంట్... తెలుసుకుందామా
                     కథలోకి వెల్తే... భూపతినగరం అనే ఒక గ్రామంలో జరిగిన కథే ఇది. ఊరి జమీందారుకు రాజు గార్కి 99 ఎకరాల పొలం... పక్కనే ఎల్బీ శ్రీరాంది ఒకేఒక్క ఎకరం. లింకేంటంటే ఎకరం నుండే 99 ఎకరాలకు నీరు రావాలి. అది అమ్మనంటాడు శ్రీరాం అండ్ అమ్మాల్సిందే అంటాడు రాజుగారు. దీనివల్ల అయ్యే గొడవల్లో శ్రీరాం చంపబడతాడు అండ్ రాజుగారు జైలుకు వెళ్ళాడం, తర్వాత అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోతాయి. దెన్ కంస్ ది ప్రెజెంట్ ఏజ్. రాజుగారి అబ్బాయి ఆదిత్యా మీనన్... తన కూతురే హీరోయిన్ శ్రీయా శర్మ. ఇక ఎల్బీ శ్రీరాం కొడుకు సూర్య అండ్ తన కొడుకే హీరో రోషన్. రోషన్ పేరు శామ్యూల్ అలియాస్ శాం. శ్రియా పేరు శాంతి. ఊల్లో ఉన్న ఒకే ఒక్క పెద్ద స్కూల్ నిర్మలా కాన్వెంట్ అండ్ అందులో ఇద్దరూ క్లాస్ మేట్స్
                  యాజ్ యూజువల్ మొదట్లో ఇద్దరికీ పెద్దగా పడదు. తర్వాత శాం తెలివితేటలు అండ్ మంచితనానికి హీరోయిన్ శాంతి ఫ్లాత్ అండ్ లవ్ స్టార్ట్ అవుతుంది. బ్యాగ్రౌడ్ లో ఒక్క ఎకరం కోసం గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఎట్ వన్ ఫైన్ మూమెంట్ శాం అండ్ శాంతిల లవ్ విషయం రాజుగారింట్లో తెలిసిపోవడం, వాళ్ళు శాం ని బాగా కొట్టడం జరుగుతుంది. శాం కోరిక మేరకు తన తండ్రి రాజు గారింటికి శాం, శాంతిల పెళ్ళి సంబంధం మాట్లాడ్డానికి వెళతాడు అండ్ రాజుగారి కుట్రలో తన ఎకరం రాసిచ్చేస్తాడూ. బట్, అక్కడే ట్విస్ట్... తన కూటురిని పెళ్ళి చేసుకోవాలంటే తనలా పేరుప్రతిష్టలతో పాటు కోట్లు సంపాదించాలన్న కండీషన్ పెడతాడు
                 ఈ గోల్ తో హైదరాబాద్ చేరుకున్న శాం అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాడం, హీరో అక్కినేని నాగార్జునను కలవడం జరుగుతుంది. ఇంతవరకు ఓకే, నాగార్జునకు, శాం కి సంబంధమేంటి? శాం కి నాగార్జున ఎలా హెల్ప్ చేశాడు? శాం పేరుప్రతిష్టాలు, డబ్బు సంపాదించాడా? సంపాదిస్తే ఎలా? రాజుగారి కండీషన్స్ లో నెగ్గి హీరోయిన్ ని సొంతం చేసుకున్నాడ? ప్రశ్నలన్నిటికీ సమాధానాలే నిర్మలా కాన్వెంట్ కథ
               ఓవరాల్ గా నిర్మలా కాన్వెంట్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. హీరోగా డెబ్యూ చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్, హీరోయిన గా డెబ్యూ చేసిన బాలనటి శ్రియా శర్మ తమ రోల్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశారు. ఇక సినిమాలో మేజర్ ఎట్రాక్షన్ అండ్ స్ట్రెంగ్త్ నాగార్జున హింసెల్ఫ్. సెకండ్ హాఫ్ లో తన రియల్ లైఫ్ రోల్ అంటే హీరో నాగాఋజునగా ఎంట్రీ ఇచ్చి ఎండ్ దాకా హీరోకు సపోర్ట్ ఉండే నాగార్జున నిర్మలా కాన్వెంట్ కు మేజర్ ప్లస్. నెక్స్ట్ మ్యూజిక్... సంగీతదర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి అందించిన నేపథ్యసంగీతంతో పాటుగా పాటలన్నీ కూడా సంగీతాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. "కొత్త కొత్త భాష" పాటయితే నీడ్లెస్ టు టెల్... అందరి నోళ్ళలో ఆల్రెడీ నానుతోందొ అండ్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైం
               డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ అంద్ కొందరు టెక్నీషియన్స్ మాత్రమే కాదు, నిర్మలా కాన్వెంట్ సినిమాతో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాటివి యజమాని అండ్ నాగార్జున్ స్నేహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ నిర్మాతగా నాగార్జునతో కలిసి డెబ్యూ చేశారు ఆన్ ది బ్యానర్ మ్యాట్రిక్స్ టీంవర్క్స్. మొదటి ప్రయత్నమే ఇంత బావుందంటే రాబోయే రోజుల్లో మరెన్నో మంచి సినిమాలు టాలీవుడ్లో ఈయన నుండి వస్తాయని ఆశిద్దాం
               ఫైనల్ గా సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నటన, కథ, కథనం, మాటలు, పాటలు... ఇలా అన్ని యాంగిల్స్ లో కూడా నిర్మలా కాన్వెంట్ ఒక మంచి సినిమా అండ్ తప్పకుండా చూడాల్సిన సినిమా అనేది నా అభిప్రాయం. డోంట్ మిస్ దిస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఆల్సో ది గ్రేట్ గేం రియాలిటీ షో ఆన్ ది బిగ్ స్క్రీన్ విత్ నాగార్జున.


Click here to view the review video