Friday, 25 November 2016

మెరుగైన సమాజం కోసం.. ఇలా కూడా చెయ్యాలా?

సాధారణంగా ప్రతీ వారం టెలివిజన్ ఛానల్స్ ఓ పరీక్ష ఫలితాలకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అదే బార్క్ (BARC) ఛానల్ రేటింగ్స్. ఈ రేటింగ్స్ ఆధారంగా ఏ ఛానల్ ఆ వారంలో నంబర్ వన్ రేటింగ్ లో ఉందో తెలుస్తుంది. ఫలితం వచ్చాక షరామామూలే. మేమే నంబర్ వన్ అంటూ తమ తమ ఛానళ్ళలో ఊదరగొట్టేస్తారు. తెలుగురాష్ట్రాల్లో చాలావరకూ మొదటి రెండు స్థానాల కోసం ప్రముఖ న్యూస్ ఛానల్స్ టివి9, టివి5 పోటీపడడం జరుగుతూ వస్తోంది. నేనంటే నేను అన్నరీతిలో ఈ పోటీ స్వల్ప మార్జిన్ తో జరగడం ప్రతీవారం పోటీని మరింత రసవత్తరంగా మారుస్తూ వస్తోంది. అయితే ఎక్కువగా 9 వారిదే ఒకింత పైచేయిగా ఉండడం, కేవలం హైదరాబాద్ వరకు చూస్తే 5 వారిది పైచేయిగా ఉండడం జరుగుతోంది.

అయితే ఈ వారం సదరు రేటింగ్స్ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ వారం రేటింగ్స్ లో టివి 5 నంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. అంటే 9 రెండవ స్థానంలో ఉందని కాదు. ఇక్కడే వచ్చింది పెద్ద మెలిక. టివి9 మరియు వి6 ఛానల్స్ కాసింత అనుమానం కలిగించేలాంటి పద్ధతులకు పాల్పడ్డం వల్ల 46 నుండి 49 వారాల వరకు రేటింగ్స్ లో సదరు ఛానళ్ళు ఉండబోవంటూ బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) ఇండియా వారు ఒక చిన్న గమనిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి, ఒకింత అసహనానికి గురి చేసింది.

దీని భావమేమి తిరుమలేశా... అంటూ అందరూ చెవులు కొరుక్కోవడం జరిగిపోయింది. అంటే బహుశా ఇలాంటి దారుల్లో ఇన్నివారాలుగా రేటింగ్స్ లో లీడ్ లోకి వచ్చారా అని కొందరు... అబ్బే ఇదేదో మిస్ అండర్ స్టాండింగ్ అయిఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా మరి మెరుగైన సమాజం కోసం అహర్నిశలూ తపిస్తూ ఉంటామని చెప్పుకునే సంస్థలపై ఇలాంటి వార్తలు రావడం...  ప్రతీ న్యూస్ కూడా తమదైన స్టైల్లో బ్రేకింగ్ న్యూస్ లా ఇచ్చే ఛానల్ న్యూసే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోవడం ఒకింత బాధాకరం.

చూద్దాం మరి ఈ బ్రేకింగ్ న్యూస్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో....

Friday, 30 September 2016

Ram Pothineni "Hyper" Telugu movie review (రాం పోతినేని "హైపర్" సినిమా రివ్యూ )

ఎనర్జెటిక్ స్టార్ రాం పోతినేని "నేను శైలజ" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా "హైపర్". టాలీవుడ్ లో హైపర్ యాక్టివ్ హీరోగా పేరుతెచ్చుకున్న రాం ఇమేజ్ కు తగ్గ టైటిల్ తో, రాం కు 'కందిరీగ" వంటి సక్సెస్ అందించిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ హైపర్ ఈ రోజు అంటే 30 సెప్టెంబర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సక్సెస్ ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్న రాం, రాశీఖన్నా, ఇటీవలి కాలంలో "బాహుబలి" నుండి తెలుగు ప్రేక్షకులకు కట్టప్పగా సుపరిచితుడైన తమిళనటుడు సత్యరాజ్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ "హైపర్" సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దామా...
హైపర్ సినిమా ఇప్పటికే అందరికీ తెలిసినట్టుగానే తండ్రీకొడుకుల పెనవేసుకున్న అనుబంధాలకు ప్రతిరూపమైన కథ. నారాయణ మూర్తి (సత్యరాజ్) ఒక నిజాయితీ అయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. వైజాగ్ లో భార్య శాంతి, కూతురు ప్రియాంక అండ్ కొడుకు సూర్య (రాం) లతో ఒక సాధారణ మధ్యతరగతి జీవితం సాగిస్తూ ఉంటాడు. 35 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసి రిటైర్మెంటుకు దగ్గర్లో ఉంటాడు. తండ్రంటే కొడుకుకు విపరీతమైన ప్రేమ, తండ్రి కోసం ఎంతదూరమైనా వెళ్లే మనస్తత్వం. ఇక నెగెటివ్ క్యారెక్టర్ రాజప్ప ఒక మినిస్టర్. ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో పర్మిషన్ కు సత్యరాజ్ సంతకం అవసరమవుతుంది. ఆ మాల్ కట్టడం నిబంధనలకు వ్యతిరేకమని సత్యరాజ్ సంతకం చెయ్యడానికి నిరాకరిస్తాడు. అదే కథలో ఒక పెద్ద మలుపు. సత్యరాజ్ అండ్ ఫ్యామిలీపై రాజప్ప దాడులు, కుట్రలు పన్నడం... వాటన్నిటినీ హీరో సూర్య తన తెలివితో ఎత్తులకు పై ఎత్తులు వేసి తిప్పి కొట్టడం జరుగుతుంది. రిటైరయ్యేలోపు సంతకం పెట్టిస్తానని రాజప్ప, రిటైరయ్యే లోపు తన పదవి పోయేలా చేస్తానని సూర్య ఛాలెంజ్ చెయ్యడం జరుగుతుంది.
కథలో మరో ప్యారలల్ లైన్ హీరోయిన్, హీరోల మధ్య లవ్ స్టోరీ. భాను (రాశి ఖన్నా) ఒక అల్లరి అమ్మాయి. సూర్యను చూసి ప్రేమిస్తుంది. ఇక సూర్య తన తండ్రికి నచ్చిన ఒక అమ్మాయిని చూడకుండానే ప్రేమిస్తాడు. అయినా తననే ప్రేమిస్తుంది భాను. మరి ఇంతకీ తన తండ్రికి నచ్చిన అమ్మాయి ఎవరు? సూర్య ప్రేమను భాను దక్కించుకుందా? రాజప్ప, సూర్యల మధ్య ఛాలెంజ్ లో ఎవరు నెగ్గారు? ఎలా నెగ్గారు? ఈ మధ్యలో జరిగే టర్న్స్ అండ్ ట్విస్ట్స్... ఇదీ టూకీగా హైపర్ సినిమా కథ...
మొత్తమ్మీద కథపరంగా అంత ఫ్రెష్ అండ్ కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లే, ట్రీట్ మెంట్ అండ్ డైలాగ్స్ పరంగా హైపర్ సినిమాకు త్నదైన స్టైల్ తెచ్చిపెట్టాడు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. హీరో రాఒ ఆల్రెడీ తనకున్న ఎనర్జెటిక్ ఇమేజ్ తో ఇది ఒక విధంగా తనకు టైలర్ మేడ్ క్యారెక్టర్ అని తన ఈజ్ అండ్ స్టైల్ తో ప్రూవ్ చేసుకున్నాడు. రాశిఖన్నా ఒక బోల్డ్ రోల్ చేసి తన గ్లామర్ తో ప్రేక్షకులకు మతీపోగొట్టడం గ్యారెంటీ. సత్యరాజ్ తన పాత్ర అండ్ నటనతో ఒక మంచి తండ్రిగా మార్కులు కొట్టేస్తే మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు ఓకే అనిపించుకున్నారు. బేసిగ్గా తండ్రి పై పిచ్చి అభిమానం, ప్రేమ పెంచుకున్న కొడుకు అనే ఒక చిన్నపాటిదారంతో బాక్సాఫీస్ అనే కొండను లాగే ప్రయత్నం చేసినట్టుగా ఉంది హైపర్ సినిమా. మరి కలెక్షన్ల వర్షం ఏ మేరకు కురుస్తుందో వేచి చూడాలి...

Thursday, 29 September 2016

"ఖైదీ నెంబర్ 150" లో చిరంజీవి "కత్తి"కి పదును తగ్గుతోందా?

"ఖైదీ నెంబర్ 150" లో చిరంజీవి "కత్తి"కి పదును తగ్గుతోందా?.... ఇప్పుడు తెలుగు సినీవర్గాల్లో, సినిమా అభిమానుల్లో, ఒకింత మెగాఫ్యామీలీ అభిమాణుల్లో సైతం ఎక్కువగా చర్చకు తెరతీస్తున్న టాపిక్స్ లో ఇది ఒకటయిపోతోంది. అందరికీ ఆల్రెడీ తెలిసినట్టుగానే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా "ఖైదీ నెంబర్ 150" తమిళంలో విజయ్ హీరోగా, ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా "కత్తి"కి రీమేక్.
ఒక అద్భుతమైన సోషియల్ మెసేజ్ తో, నేచురల్ గా తెరకెక్కిన చిత్రం "కత్తి". ఆ సినిమా కలెక్షన్ల పరంగానే కాకుండా, కథ, కథనాల్లో ఒక వైవిధ్యమైన స్థానాన్ని కోలీవుడ్లో సంపాదించుకుంది. ఆల్రెడీ సూపర్ స్టార్డం ఉన్న విజయ్ కీర్తికిరీటంలో "కత్తి" మరో కలికితురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు "కత్తి"కి తెలుగు రీమేక్ గా వస్తున్న "ఖైదీ నెంబర్ 150" ఎందుకో నేచురాలిటీకి అండ్ రియాలిటీకీ కొంచెం దూరం వెళుతోంది అని వినికిడి.
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మెగా పవర్ స్టార్, చిరంజీవి తనయుడు అయిన రాంచరణ్ "కొణిదెల ప్రొడక్షన్స్" పేరుమీద సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసి మరీ తన తండ్రిని రీలాంఛ్ చేయడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. ఇక చిరంజీవి కి ఆల్రెడీ ఉన్న మెగా స్టార్డం, మధ్యలో వచ్చిన పెద్ద గ్యాప్, మెగా ఫ్యామిలీ హీరోస్ క్రేజ్... ఇలా అన్నీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని మార్చేశాయి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేటివిటీ, స్టార్డం, ష్యూర్ షాట్ సక్సెస్ కొట్టాలన్న తపన... ఇలా అన్నీ కలగాపులగంగా మారి కత్తికి పదును తగ్గిస్తున్నాయట. చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు, భారీ భారీ డైలాగ్స్, డ్యాన్సెస్, ఫైట్స్, కామెడీ... ఇలా నవరసాల్లో డోస్ పెంచేశారట. అలాగే ఆల్రెడీ ఫేడవుట్ స్టేట్ లో ఉన్న బ్రహ్మానందం తో మరో సారి అరిగిపోయిన ఊరమాస్ కామెడీ కూడా చేయించినట్టు వినికిడి. అలాగే రాంచరణ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలందరూ మధ్యలో ఓ చిన్న ఝలక్ కూడా ఇచ్చేలా స్పెషల్ అప్పియరెన్స్ ప్లాన్ చేశారట. అన్నట్టు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ్ నిహారిక కూడా కనిపించేస్తే కంప్లీట్ ఫ్యామీలీ ప్యేకేజ్ అవుతుందేమోగా అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇవన్నీ సినిమాకు నెగెటివ్ కాకుండా పాజిటివ్ అయ్యి చిరంజీవి కంబ్యాక్ గ్రాండ్ లెవెల్లో సక్సెస్ అయితే బాగుంటుందని ఆశిద్దాం.

Raashi Khanna looking cute in traditional outfitRam Pothineni latest Telugu movie "Hyper" posters & Stills


Sunil latest movie "Eedu Gold Ehe" Posters


Prakash Raj, Priyamani starrer "Mana Oori Ramayanam" stills